మిఠాయి కాదు బిస్కెట్

Mithai

ఈ వారం ఒక చిన్న సినిమాగా వచ్చిన మిఠాయి పై చాలా ఆశలే పెట్టుకున్నారు యూత్.ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉంది,కంటెంట్ లో బోల్డ్ నెస్ ఉంది,ఫ్రెష్ నెస్ కూడా ఉండే ఉంటుంది అని లెక్కలు వేసుకుని మరీ సినిమాకి వెళ్లారు.కానీ తీరా మిఠాయి మొదలయిన కాసేపటికే సినిమాలో ఏం మ్యాటర్ లేదు అనే సంగతి అర్ధమయింది.సినిమాలో ఏం జరుగుతుంది అన్న విషయం మాత్రం అర్ధం కాలేదు.

అయితే అప్పుడే ఆ సినిమా ప్లాప్ అంటూ లీడ్ యాక్టర్ నుండి డైరెక్టర్ వరకు ఒకటే పోస్టులు.ఆ పోస్టులు,ఓపెన్ లెటర్స్ సంగతి చూస్తే వీళ్లంతా వినయ విధేయ రామ వీర భక్తుల అన్న అనుమానం కలగకమానదు.అయినా ఎలాంటి సినిమాకయినా కాస్తో కూస్తో కాసులు రాల్చే వీక్ ఎండ్ కూడా దాటకుండా ఇలా తొందరపడాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది అర్ధం కావట్లేదు.సినిమాలో అసలు ఏం కంటెంట్ లేదు,ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అది అసలు సినిమానే కాదు.

అలాంటప్పుడు అసలు సినిమాని రిలీజ్ చెయ్యడం దేనికి.అంతా అయిపోయాక ఇప్పడు తీరిగ్గా సారీ అంటూ మొక్కుబడిగా ఆపాలజీ చెప్పడం దేనికి?.దీనికి సమాధానం కూడా వాళ్ళకే తెలియాలి.సినిమా కంటెంట్ భయంకరంగా ఉన్నా ఆ సినిమా పోస్టర్స్ పై ఉన్న ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ల ఫేసులు చూసి అయినా నాలుగు డబ్బులు రాలతాయి కదా.ఆ మాత్రం ఆలోచన కూడా లేదు వాళ్ళకి.అయినా సినిమా తీసి బాలేదు అని చెప్పడంలో ఉన్న నిజాయితీలో సగం అయినా సినిమా తీసే టైం లో ఉండుంటే ఇప్పడు ఈ పరిస్థితు వచ్చేది కాదు.మొత్తానికి మిఠాయి అని టైటిల్ పెడితే బిస్కెట్ అయ్యింది.