నితిన్ తో ప్రియా వార్…!

Nithin-PriyaWarrior
Nithin-PriyaWarrior

ఒక కంటి సైగతో గూగుల్ ని షేక్ చేసిన బ్యూటి ప్రియా వారియర్. యా వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరిట విడుదలైంది. అయితే, ప్రోమో వీడియోలతో విపరీతంగా పాపులర్ అయిన ప్రియా సినిమాతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఘోరంగా విఫలమవడంతో ప్రియా వారియర్ గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. అయితే హీరో నితిన్ సినిమా తో ప్రియా ప్రకాష్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఆ మూవీలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ సెలెక్ట్ అయినట్టు సమాచారం.