తమిళనాడు ప్రచారంలో ప్రధాని ఏమన్నారంటే…

PM Narendra Modi
PM Narendra Modi

మ‌హాకూట‌మి నేత‌ల్లో ఎవ‌రు కూడా రాహుల్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌న్నారు ప్ర‌ధాని మోదీ. త‌మిళ‌నాడులోని తేనిలో ఎన్నిక‌ల స‌భ‌లో ఆయన మాట్లాడారు. డీఎంకే నేత స్టాలిన్ ఒక్క‌రే రాహుల్ ప్ర‌ధాని కావాల‌ని కోరుకుంటున్నారన్నారు. మ‌హాకూట‌మి నేత‌లంతా ప్ర‌ధాని కావాల‌న్న ఆసక్తితో ఉన్నార‌న్నారు ప్రధాని. అందుకే ఎవ‌రూ రాహుల్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు మోదీ. తమిళ అగ్రనేతలు ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు మోదీ వెల్లడించారు. ఈ ఇద్ద‌రు గొప్ప నేత‌ల‌ను చూసి భార‌త్ గ‌ర్విస్తున్న‌ద‌న్నారు . ఈ ఇద్ద‌రూ పేద‌ల అభ్యున్న‌తి కోసం ప‌ని చేశార‌న్నారు కొనియాడారు. ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ ప్ర‌గ‌తి వేగంగా దూసుకెళ్లుతున్న‌ద‌ని, కానీ కాంగ్రెస్‌, డీఎంకే, మ‌హాకూట‌మి మిత్రులు మాత్రం అసంతృప్తితో ఉన్నార‌న్నారు ప్రధాని మోదీ .