పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో వాజ్‌పేయీ చిత్రపటం ఆవిష్క‌ర‌ణ

Atal-Bihari-Vajpayee
Atal-Bihari-Vajpayee

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పెయీ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయీ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది ఆగస్టు 16న క‌న్నుమూశారు. వాజ్‌పేయీకి భారతరత్న ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది.

ఈ చిత్ర ప‌ట విష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్రమంత్రులు పలు పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరై వాజ్‌పేయీకి నివాళులర్పించారు.

వాజ్‌పేయీ గడిపిన సాధారణ జీవితం అందరికీ ఒక పాఠం నేర్పింద‌న్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ . రాజకీయ వేత్తగా, కవిగా, అసాధారణ ప్రతిభావంతుడిగా అందరిపై ప్రభావం చూపార‌న్నారు. జీవితాంతం తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి జీవించార‌న్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వాజ్‌పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు.