ప్రేమెంత పనిచేసే నారాయణ రివ్యూ

Prementha Panichese Narayana
Prementha Panichese Narayana

నటీనటులు : జొన్నలగడ్డ హరికృష్ణ , అక్షిత, ఝాన్సీ
దర్శకత్వం : జొన్నలగడ్డ శ్రీనివాస్
నిర్మాతలు : సావిత్రి జొన్నలగడ్డ
సంగీతం : వినోద్ యాజమాన్య
విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019

రేటింగ్ : 2/5

దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న` ప్రేమెంత పనిచేసే నారాయణ` సినిమా టీజర్, ట్రైలర్ మంచి బంజ్ ను క్రియేట్ చేసాయి.దీనికి తోడు రిలీజ్ విషయంలో అల్లు అరవింద్ హ్యాండ్ కూడా ఉందని రివీల్ చేయడంతో సినిమా గురించి మీడియా సర్కిల్స్ సైతం హాట్ టాపిక్ అయింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ:

హరికృష్ణ( హరి) ఓ అనాధ. బ్రతకు పోరాటంలో హరికి మరో మగ్గురు స్నేహితులు తోడవుతారు. ముగ్గురు ఓ పెద్దాయన (బాబాయ్) వద్ద పనికి కుదురుతారు. హరి తొలి చూపులోనే శిరీష(అక్షిత)ను ప్రేమిస్తాడు. ప్రేమ కోసం వెంటపడి చివరికి శిరీష్ ప్రేమను పొందుతాడు హరి. శిరీష తల్లి ఓ పెద్దింట్లో పనిమనిషి. ఆమె గయ్యాలి. ప్రేమగీమా అంటే జాన్తా నయ్ అనే టైపు. అమె కో తమ్ముడు. అతని రూపంలో హరి ప్రేమకు అడ్డంకులు ఏర్పడతాయి. వాటన్నింటినీ జయించే ప్రోసస్ లో !మేయర్ రాజేశ్వరీ (జాన్సీ) నుంచి ప్రేమ జంటకు ప్రాణాపాయం ఏర్పడుతుంది. మరి ఆ ప్రమాదానికి అసలు కారణం ఎవరు? హరి ప్రేమించిన అమ్మాయిని దక్కిచుకోవడం కోసం ఎలాంటి సాహసాలు చేసాడు? అందుకు హరి స్నేహితులు? ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు! అన్నది తెరపైనే చూడాలి.

విశ్లేషణ:

ప్రేమ కథలను ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్లో చెబుతాడు. డైరెక్టర్ ఎవరైనా ప్రేమలో ఘాడతను బట్టే సినిమా హిట్! ప్లాప్ అన్నది డిసైడ్ అవుతుంది. అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ పుట్టడానికి కారణాలేవి ఉండవు. ఎక్కడైనా లవ్ఎట్ ఫస్ట్ సైట్ అన్నదే కాన్సెప్ట్. అయితే ఆ కథను ఆసక్తికరంగా మలచడమే దర్శకుడి పనితనానికి సవాల్. ఆ విషయంలో దర్శకుడు జొన్నలగడ్డ కొంతవరకు సక్సెస్ అయ్యాడు.కథను కామెడీగా ప్రారంభించి ఒక్కసారిగా సీరియస్ మెడ్ లోని, ఎమోషన్ లోకి తీసుకెళ్లాడు. ప్రధమార్థంలో స్ర్కాప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు పర్లేదనిపిస్తాయి.హరి-శిరీష ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ వెంట పడే సన్నివేశాలు రొటీన్ గా ఉన్నప్పటికీ యవతను ఆకట్టుకుంటాయి.నలుగురు స్నేహితుల మధ్య పక్తు కామెడీని పండించే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోకుండా ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చూపించాడు.ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో పడే పాట్లు మొదలవుతాయి. ప్రేమికురాలి ప్రాణమా? ప్రేమ కావాలా? అన్న సన్నివేశం ఎదురైనప్పుడు హీరో నలిగిపోయే సన్నివేశం బాగుంది. స్నేహితుల పాత్రలకు దర్శకుడు అంతే వెయిట్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకూ ఆ పాత్రలకు హీరోతో పాటు సమాన భారాన్ని మోసారు. హీరోయిన్ తల్లి పాత్ర ఎగ్రసివ్ గా ఉంటుంది. కన్న కూతురికే ఆ పాత్రను ఓ విలన్ లా చిత్రీకరించాడు. ప్రేమ కథ అయినప్పటికీ కొన్ని లిమిటిషేన్స్ ప్రకారం చేసాడు. కథలో ఎక్కడా అసభ్య కర సన్నివేశాలు, అడల్ట్ కంటెంట్ ఎక్కడా ఉండదు.క్లైమాక్స్ ఆ మధ్య సంచలనం రేపిన మిర్యాల గూడ ఇన్సిండె ట్ ను ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.

నటీనటులు:

హీరో హరికృష్ణ కు డెబ్యూ మూవీ అయినప్పటికీ..ఆ ఫియర్ ఎక్కడా కనిపించలేదు. రెండు, మూడు సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడిలా ఎక్స్ ప్రెషన్స్ అన్నింటిని బాగా క్యారీ చేసాడు. యాక్టింగ్ లో మంచి ఈజ్ ఉంది. కెమెరా ఫియర్ కనిపించలేదు.అతని ఎనర్జీకి తగ్గ పాటలు కుదరడంతో ట్యాలెంట్ మొత్తం చూపించాడు. మంచి కథలు పడితే ప్యూచర్ మంచి నటుడిగా రాణించే అవకాశాలు ఉన్నాయి.హీరోయిన్ అక్షిత కూడా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతోంది. ఆమె కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. హీరో స్నేహితుల పాత్రలు బాగున్నాయి. మేయర్ పాత్రలో ఝాన్సీ నటన బాగుంది. మిగతా పాత్రలు కూడా ఓకే.

సాంకేతిక నిపుణులు:

జొన్నలగడ్డ శ్రీనివాసరావు అనుకున్న పాయింట్ ను ఎలాంటి కన్ ప్యూజన్ లేకుండా సూటిగా చెప్పేసాడు. కథలో కామెడీ పండిచే ఛాన్స్ ఉన్నా! ప్రేమలో ఘాడతను మాత్రమే చెప్పాడు. స్ర్కాప్ డ్యాక్ డ్రాప్ లో ఇంకొన్ని కామెడీ సన్నివేశాలు జొప్పించి ఉంటే బాగుండేది. మేకింగ్ పరంగా సినిమా బాగుంది. స్ర్కీన్ ప్లే మాత్రం రొటీన్ టచెస్ తో సాగింది.సినిమాటోగ్రఫీ, కొరియోగ్రపీ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. వనమాలి, గోసల రాంబాబు సాహిత్యం బాగుంది. యాజమాన్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు పర్లేదు అనిపిస్తాయి.

చివరిగా : అదే పాత ప్రేమ కథ