అప్పుడు శ‌త్రువు – ఇప్పుడు మిత్రుడు – మారిన గ‌జ్వేలు రాజ‌కీయాలు

Pratap Reddy Vanteru
Pratap Reddy Vanteru

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు వుండ‌ర‌న‌డానికి ఒంటేరే ఉదాహ‌ర‌ణ‌. నిన్న‌టి వ‌ర‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా, గ‌జ్వేలు బ‌రిలో కొర‌క‌రాని కొయ్య‌గా వున్న కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కారెక్కేశారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన నేరుగా సీఎం కేసీఆర్ దగ్గరికెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్‌తో కలిసి ఒంటేరు ఫొటో దిగడం జరిగింది. ఈ సందర్భంగా కొంత‌సేపు సిఎం కేసీఆర్ – ఒంటేరు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం.

బహుశా ఇలా తన బద్ధశత్రువు గూటికి చేరతానని ఒంటేరు.. తన ప్రత్యర్థి పార్టీలో చేరతారని కేసీఆర్‌‌ ఊహించి ఉండరేమోన‌ని పొలిటిక‌ల్ టాక్ న‌డుస్తోంది. ఇటు ఒంటేరును ఎమ్మెల్సీ చేసి నామినేటెడ్ పదవి ఇస్తారని పుకార్లు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ఒంటేరు మాత్రం తాను పదవి ఆశించి వెళ్లట్లేదని కేవలం.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరానని చెబుతున్నారు. నాలుగేళ్లలో నియోజవకర్గం రూపురేఖలు మారిపోతాయని ఒంటేరు చెప్పుకొచ్చారు.