ఎక్స్ క్లూజివ్:RRR లో ప్రభాస్

Prabhas
Prabhas

ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ల కలయిక,బాహుబలితో ప్రపంచాన్ని గెలిచివచ్చిన జక్కన్న డైరెక్షన్…ఈ విశేషాలు చాలు దానయ్య పెడుతున్న 400 కోట్లు రిలీజ్ కి ముందే లాభాలతో సహా రికవర్ కావడానికి.కానీ ఉన్న దానితో సర్దుకుపోతే అతను రాజమౌళి ఎందుకు అవుతాడు?,అపజయమెరుగని దర్శకుడిగా ఎలా కొనసాగగలుగుతాడు.అందుకే పకడ్బందీ కథా కథనాలు,తిరుగులేని స్టార్ కాస్ట్ ఉన్న RRR కి ఇంకా అదనపు ఆకర్షణలు జోడిస్తున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ గాయం వల్ల RRR నార్త్ ఇండియన్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.కానీ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో మాత్రం RRR కి సంబందించిన షూటింగ్ జరిగింది.

RRR షూటింగ్ జరగడం లో వింత ఏమీ లేదు.కానీ ఎన్టీఆర్ గాని,చరణ్ గాని లేకుండా మూడు హీరో తో రాజమౌళి షూటింగ్ చేసాడు.ఇప్పడు ఇది హాట్ టాపిక్ గా మారింది.బాహుబలి తో ఇంటర్నేషనల్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తో RRR ని షూట్ చేసాడు జక్కన్న.రెండ్రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది.అంటే RRR కాన్సాస్ రేంజ్ పెంచడం కోసం ప్రభాస్ క్రేజ్ ని కూడా వాడుకున్నాడు జక్కన్న.RRR ఓపెనింగ్ కి ప్రభాస్ కూడా వచ్చినా RRR లో అతను కూడా నటిస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు.అయితే ఈ రెండు రోజుల షెడ్యూల్ తో ప్రభాస్ పాత్రా తాలూకూ షూటింగ్ పూర్తయిందా లేక బ్యాలన్స్ ఏమైనా ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

గతంలో కూడా యమదొంగలో సీనియర్ ఎన్టీఆర్ ని,మగధీర లో చిరంజీవి ని కామియో రోల్స్ లో చూపించిన ఫ్యాన్స్ కి కిక్కెక్కించిన జక్కన్న ఈసారి మాత్రం ప్రభాస్ ని గెస్ట్ రోల్ చూపించి సాలిడ్ షాక్ ఇవ్వబోతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ సినిమాలో కనిపించడంతో ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా మారబోతుంది అనేది మాత్రం కన్ఫర్మ్.RRR లో పోస్టుపోన్ అయిన షెడ్యూల్ ఈ నెల 25 నుండి స్టార్ట్ కాబోతుంది.