ప్రభాస్ కోసం దిల్ రాజు ‘భారీ’ స్కెచ్

dil raju

బాహుబలి తరువాత ప్రభాస్ కి స్టోరీ నెర్రెట్ చెయ్యాలి అనుకున్న డైరెక్టర్స్ లిస్ట్ తగ్గిపోయింది.తారుమారయిపోయింది.దానికి కారణం ఎవరి డైరెక్షన్ లో అయితే ప్రభాస్ సినిమా చెయ్యాలి అనుకుంటే వాళ్ళను పిలిపించి కథలు వింటున్నాడు.బాలీవుడ్ మేకర్స్ కే దొరకట్లేదు మన డార్లింగ్.కానీ ప్రచారానికి దూరంగా తన నెక్స్ట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఇప్పటికే జాన్ అండ్ సాహో సినిమాలను హై స్టాండర్డ్ లో పూర్తిచేసే పనిలో ఉన్నాడు ప్రభాస్.సాహో కి 2019 ఆగస్టు 15 డేట్ కూడా ఇచ్చేసారు.తన హోమ్ బ్యానర్ లాంటి నువ్లో తప్ప బయట సినిమాలు ఓకే చెయ్యని ప్రభాస్ దిల్ రాజుకి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.

రీసెంట్ గా KGF తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కలిసిన మాట వాస్తవం.కానీ ఆ మీటింగ్ వెనుక ఉన్నది దిల్ రాజు అనేది అసలు ట్విస్ట్.భారతీయుడు-2 సినిమా 200 కోట్లతో ప్రొడ్యూస్ చేయాలి అనుకున్న దిల్ రాజు శంకర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విని వెనక్కు తగ్గాడు.కానీ ఇప్పడు మాత్రం ప్రశాంత్ నీల్ తో అదే 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్లబోతున్నాడు.ప్రశాంత్ అండ్ ప్రభాస్ ఇద్దరికీ నేషనల్ మార్కెట్ ఉంది,కథలో దిల్ రాజు మార్పులు చేర్పులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు.

అందుకే ఇప్పటికే ప్రభాస్ తో మున్నా,మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసిన దిల్ రాజు ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.KGF తో ప్రేక్షకులను ఒక సరికొత్తలోకంలోకి వెళ్లిన అనుభూతి అందించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం ఎలాంటి నేపధ్యం ఎంచుకుంటాడో చూడాలి.ఈ సినిమా తరువాత వరుసగా బాలీవుడ్ సినిమాలు నిర్మించాలి అనేది దిల్ రాజు ఆలోచన.