పంచాయ‌తీ తుది పోరుకు స‌ర్వం సిద్దం

Elections
Elections

తెలంగాణ రాష్ట్రంలోబుధ‌వారం తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రాత్రి వరకు ఎన్నికల విడుదలయ్యే అవకాశం ఉంది.

573 పంచాయతీలు ఏకగ్రీవం కాగా … 3 వేల 529 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 11 వేల 667 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 8 వేల 956 వార్డులు ఏకగ్రీవం కాగా, 27 వేల 583 వార్డుల్లో 67 వేల 316 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.