ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర

YS Jagan Bus Yatra
YS Jagan Bus Yatra

ఏడాదికి పైగా వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ప్ర‌జా సంక‌ల్ప‌ యాత్ర బుధ‌వారం ఇచ్చాపురంలో ముగియ‌నుంది. పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను ఎంతో ప్ర‌తిస్టాత్మ‌కంగా తీసికొని ప్ర‌జ‌ల‌తో మ‌మేకానికి కాస్త విరామం ఇవ్వ‌నున్నారు జ‌గ‌న్‌.ఈ నేప‌ధ్యంలోనే బ‌స్సు యాత్ర తెర‌పైకి వ‌చ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని బస్సుయాత్ర చేసేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్రవరి 2వ తేదీ నుంచే దీనిని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. దీని ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఫిబ్రవరిలో వస్తుంది. ఈ కారణంగా 7 జిల్లాల్లో కోడ్‌ అమలులోకి వస్తుంది. ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ ఆయా జిల్లాల్లో పర్యటించి స‌ర్కారు తీరును ఎండ గ‌ట్టేందుకు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే సమయంలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తాయని జగన్‌ తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇదే జ‌రిగితే ఫిబ్రవరి నుంచే ప్రభుత్వ పాత్ర నామ మాత్రమే అవుతుంద‌ని జగన్‌ అభిప్రాయంగా వున్న‌ట్లు తెలుస్తోంది.

YS Jagan Bus Yatra
YS Jagan Bus Yatra

హైదరాబాద్ లోని లోట్‌స్ పాండ్ కే జగన్‌ పరిమితం అవుతున్నారన్న విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా… విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో నిర్మిస్తున్నఇంటిలో జ‌గ‌న్ ప్రవేశించేందుకు ముహూర్తం కూడా చూసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. త్తానికి విజ‌య‌వాడ వేదిక‌గా ఏపి రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి.