అతిపెద్ద క్రికెట్ స్టేడియం…

Cricket Stadium Ahamadabad Gujarat Dist melbourne stadium

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. అదీ అహ్మదాబాద్‌ లో నే తయారవుతుంది . మొతెరాలో 63 ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త టెక్నాలజీ సహాయంతో, రూ.700 కోట్ల ఖర్చుతో గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. ఈ స్టేడియానికి సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు కూడా పెట్టారు. ఈ స్టేడియం కు 2018లో శంకుస్థాపన చేసి, నిర్మాణం పనులు వేగంగా చేపిస్తున్నారు. 2019 వరల్డ్ కప్ వరకు కంప్లీట్ చేయాలనే ప్లాన్ చేసినా,కానీ కాస్త ఆలస్యం అవితుంది అన్నారు. మొత్తంగా 2019 చివరన స్టేడియం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు.

90వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్ స్టేడియం ఉంది తెలుసుకదా , కానీ ఇది ఒక లక్షమంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఎంపీ పరిమల్ నత్వాని తెలిపారు. ఈ గ్రౌండ్ వర్షం వచ్చినా తడవదు అన్నారు. స్టేడియం పైకప్పు ఆటోమేటిగ్గా మూసుకుంటుంది ,తెరుసుకుంటుంది ఆ సదుపాయాలు ఉన్నాయి అన్నారు.