ఇక స్థానిక స‌మ‌రానికి పోలింగ్

Local Elections
Local Elections

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు సోమ‌వారం జ‌ర‌గ‌నున్నాయి. అభ్య‌ర్ధుల‌ ప్రచార గడువు శ‌నివారం సాయంత్రంతో ముగిసింది. మొదటి విడతలో 4479 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. .

వీటితో తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు.. మరో 769 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3 వేల 701 పంచాయతీలకు ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే తొలి విడతలో 39,822 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 192 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

10 వేల 654 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. 28 వేల 976 వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక జరగనుంది. సోమ‌వారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్.. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మ‌రోవైపు స్థానిక స‌మ‌రంలో కూడా తెర వెనుక ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు మ‌ద్యం, న‌గ‌దు ఎర వేస్తున్నారు అభ్య‌ర్ధులు.