తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

telangana assembly

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తుందని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమాధానమిచ్చారు.తాము ఇచ్చిన హామీలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు.గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేసినట్లు ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు విషయాలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.ఆ తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.ఇటు మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మండలి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది.