నేటి నుంచి రెండో విడత పంచాయతీ స‌మ‌రం

MLC Elections

రెండో విడత పంచాయతీ ఎన్నికల సంరంభం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.14న నామినేషన్లను పరిశీలించి పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు.15న నామినేషన్ల పరిశీలనలో తీసుకున్న నిర్ణయాలపై అప్పీళ్లను స్వీకరించి 16 నాటికి పరిష్కరించనున్నారు.నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు అవకాశం ఉండనుంది. 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.