ఓట‌రు న‌మోదుకు ఇదే లాస్ట్ ఛాన్స్

Inclusion of Name in Electoral Roll for First time Voter
Inclusion of Name in Electoral Roll for First time Voter

తెలంగాణ‌లో ఓటరుగా నమోదు చేసుకునేందుకుగాను ఇదే చివరి అవకాశం. ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో ఎనిమిది రోజులే గడువుంది . ఎవరైతే అర్హులైన వారు ఉంటే ఈనెల 26 లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ceotelangana.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

అంతేకాకుండా పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పులను సరిచేయించుకోవచ్చు. అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక క్యాంపులను కూడా ఆ యా జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కులేని 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించేందుకు ఈనెల 20న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అంతేకాకుండా ఓటరు నమోదుకై ప్రతీ గ్రామ పంచాయతీల్లో బ్యానర్ లను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు . ఆన్‌లైన్ లేదా మీ సేవా ద్వారా ఓటరు గుర్తింపు కార్డుకై దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకుగాను పదో తరగతి మార్కుల మెమోతోపాటు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓటరుగా నమోదు చేసుకునే వారికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది.