ఈబీసి రిజ‌ర్వేష‌న్ ల బిల్లుకు పెద్ద‌ల స‌భ గ్రీన్ సిగ్న‌ల్

Rajya Sabha

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు పెద్ద‌ల‌సభలో ఆమోదం పొందింది. లోక్ సభ నుంఢి వచ్చిన బిల్లు రాజ్యసభలో యధాతదంగా ఆమోదం పొందింది. ఈబీసిలకు పదిశాతం రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా 165ఓట్లు.. వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి. ఇక యాభై శాతం మించకూడదన్న రాజ్యాంగ నిబంధనను సవరించడానికి ప్రవేశ పెట్టిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదం పొందింది.

రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 165ఓట్లు.. వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి.మ‌రోవైపు బిల్లును సెలెక్షన్ కమిటీకి పంపించాలని, ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుపై రాజ్య సభలో సుదీర్ఘంగా చర్చ సాగింది.ఈ బిల్లు సవరణకు రాజ్య సభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.