అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్ల వర్తింపు

union cabinet

లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఏడాదికి 8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి.ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది.మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.