వైసిపి రాయ‌భారాలు అంటూ జ‌న‌సేనాని హాట్ కామెంట్స్

pawan kalyan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు.ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సీట్లు, ఓట్లు దక్కవు అన్న నేతలే ఇప్పుడు మన పార్టీతో పొత్తుకు రావడానికి మాట్లాడుతున్నారని, ఇదే మనం బలపడడం అన్న దానికి సంకేతాలు అన్నారు.

టి ఆర్ ఎస్ పార్టీ నేతలతో రాయభారం పంపుతున్నారన్న పవన్, ఇప్పటి ఎమ్మెల్యేలు కేవలం దోచుకోవడం మీదే దృష్టి పెడుతున్నార‌ని ఆరోపించారు.ఇటు పాదయాత్ర ముగింపు రోజు కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని క్లారిటీ కూడా ఇచ్చారు.ఈ నేప‌ధ్యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లులో వాస్త‌వాలు తెలియాలి అంటే వైసీపీ లేదా టీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు పెద‌వి విప్పాల్సిందే…