కోల్కతాలో విపక్షాలు ఏకమయ్యేనా..!

భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.  ప్రతిపక్షాల ఐక్యతను చాటి చెప్పేందుకు  పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 19న కోల్‌కతా వేదిక‌గా  మెగా ర్యాలీకి పిలుపు నిచ్చారు .  బిజేపి  వ్యతిరేక పార్టీల నేతలందరినీ ఆమె ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు  ఆహ్వానించారు .  అయితే మమత  ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్‌ సోనియాగాంధీ డుమ్మా కొట్టే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

మమతా బెనర్జీతో రాహుల్ గాంధీ వేదిక పంచుకునేందుకు పశ్చిమ్ బంగా కాంగ్రెస్‌  సుముఖత వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో ఈ ర్యాలీకి దూరంగా ఉండాలని సోనియా, రాహుల్  డిసైడ్ అయిన‌ట్లు  సమాచారం.  అయితే  కోల్‌కతాలో నిర్వహించే ఈ ప్రతిపక్షాల ర్యాలీకి కాంగ్రెస్‌ తరఫున పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే హాజరుకానున్నారు . ఇటు  వామపక్షాలు కూడా ఈ ర్యాలీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.  అటు బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా దీదీ ఆహ్వానించారు .  అయితే  దీనిపై  ఆమె ఇంతవరకూ స్పందించ లేదు  . ఈ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ,  టి ఆర్ ఎస్ , జేడీఎస్‌,  ఆమ్‌ ఆద్మీ పార్టీ,  ఎన్సీపీ, పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌,  డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆహ్వానించింది.

ఈ నేప‌ధ్యంలో  తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి  మమతాబెనర్జీ మాత్రం,   కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బిజేపియేతర పార్టీలన్నీ  త‌ర‌లివ‌స్తాయ‌ని చెబుతున్నారు.