కోడిక‌త్తి కేసులొ ఎన్ఐఏ ఛార్జ్ షీట్

NIA
NIA

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ వేసింది. నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను కూడా ఛార్జ్ షీట్ కు జత చేసింది.

ఛార్జ్ షీట్ లో ఏ1 గా శ్రీనివాసరావును పేర్కొంది. ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ… విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు వెల్ల‌డించింది. దీన్ని ఆంద్ర‌ప్ర‌దేశ్ పోలీసులు విచారిస్తున్న నేప‌ధ్యంలో … కేంద్ర ప్రభుత్వం కేసు విచారణను హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏకు అప్పగించింది.