పార్టీ కేడ‌ర్ ను అలెర్ట్ చేసిన ఏపి సిఎం

N Chandrababu Naidu
N Chandrababu Naidu

రాష్ట్రాన్ని మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు..రాష్ట్ర పర్యటనకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులను టీడీపీ నాయకులెవరైనా కలిస్తే కఠినంగా వ్యవహరిస్తాన‌న్నారు.ఎలక్షన్‌ మిషన్‌ 2019 పై ఆయన పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. బంధుత్వాలు, స్నేహం పేరుతో పార్టీ ప్రయోజనాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ నేప‌ధ్యంలో మంత్రి తలసాని తీరుపైనా ఆయ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కు తీర్చుకునేందుకు దేవాలయానికి వచ్చి ఎవరైనా రాజకీయాలు చేస్తారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించి అక్కడి వారికి అన్యాయం చేశారని, కానీ ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను చూసి విపక్ష నేతలకు కంటగింపు కలుగుతోందని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతి చూసి అసూయ పడుతున్నాయని చెప్పారు