వైసిపి అధినేత జగన్ త్వరలో తన మకాంను అమరావతికి మార్చనున్నారు.ఇప్పటికే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కోసం నూతన గృహ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెల 14న జగన్ కుటుంబ సమేతంగా నూతన గృహంలో గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అయిన జగన్.. ఇప్పటి వరకూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.
దాంతో వైసిపి ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. ఇప్పుడు జగన్ తన మకాంను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చనుండటంతో పార్టీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడకు తరలిరావడం ఖాయంగా చెబుతున్నారు. జగన్ అమరావతిలో నిర్మించుకున్న నూతన గృహంలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టారని చెబుతున్నారు .