ముహూర్తం ఖ‌రారు చేసుకున్న వైసిపి నేత‌ జ‌గ‌న్

jagan-house
jagan-house

ఆంద్ర‌ప్ర‌దేశ్ నుంచే అన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు వైసిపి అధినేత జ‌గ‌న్ ప్లాన్ చేసుకున్నారు. అక్క‌డే మ‌కాం వేసి సార్వత్రిక ఎన్నికల‌కు సిద్దం అవుతున్నారు. ఈ నేప‌ధ్యంలోనే తాడేపల్లిలో ఆయన తన ఇంటిని నిర్మించుకున్నారు. నివాసానికి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. వీటిలో అడుగుపెట్టేందుకు ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 8.21 గంటలకు ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు.

ఇక నుంచి హైదరాబాద్ లోనే నివాసం ఉంటే ప్రయాణాలకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుందన్న ఆలోచనతో, అమరావతి నుంచే రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నారు. ఇక త్వరలోనే వైసీపీ పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గృహ ప్రవేశంకు కుటుంబ‌ సభ్యులు, కొందరు ముఖ్య అతిథుల మధ్య జరుగుతుందని లెలిసింది. అదే రోజున జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని స‌మాచారం.