ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలన్నదే ఆయన కోరిక: చంద్రబాబు

KCR, Chandrababu, Nara, Trs, Tdp, Congress, Bjp,

ఎలక్షన్ మిషన్ 2019 పై సీఎం బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తామన్నా ఆయన ఈ రోజు … రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేర కే ఎన్నికల్లో పోటీలుంటాయి అన్నారు . సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, యునైటెడ్ ఇండియా పేర్ల తో…. అన్ని పార్టీలని ఒకే వేదికపైకి తీసుకొస్తామని… కర్ణాటక, కోల్ కత్తాలో సక్సెస్‌ చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ తో పొత్తు ఉండదని…… అయినా కాంగ్రెస్ నేతలు కోల్ కత్తా ర్యాలీకి వచ్చారని తెలిపారు. నిరంకుశ పాలన అంతమే కామన్ మినిమం ప్రోగ్రాం అని అన్నారు చంద్రాబాబు.

దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడమే తమ ఉమ్మడి అజెండా అని , రాజ్యాంగాన్ని రక్షించడమే బిజేపియేతర 23 పార్టీల అజెండా అని అన్నారు. ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీల భద్రతే ఉమ్మడి అజెండారాష్ట్ర హితం కోరే ప్రతిఒక్కరూ టిడిపితోనే ఉండాలని అన్నారు . వైసీపీ, బీజేపీలు స్వార్ధం అని ……. టీడీపీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తోదన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడమే బీజేపీ, వైసీపీల పని అని అన్నారు

అటు ఈ టెలికాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌పై తీవ్రం గా విరుచుకుపడ్డారు . ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలనేదన్నదే కేసిఆర్ అబిప్రాయం అని అన్నారు చంద్రబాబు.