వేదఘోషతో మార్మోగిన ఎర్రవల్లి

KCR
KCR

ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన చండీయాగం సమాప్తమైంది ఐదురోజులుగా జరిగిన ఈ యాగంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి చేప‌ట్టారు.

అన్ని యాగాల పూర్ణాహుతులు జరిపి, సహస్ర చండీ మహా యాగ పూర్ణాహుతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు . కార్యక్రమానంతరం సీఎం కేసీఆర్ ఋత్వికులను ఘనంగా సన్మానించారు. దేశక్షేమం, లోక సంరక్షణమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కే సీఆర్ ఐదురోజులపాటు నిర్వహించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం విజయవంతంగా ముగిసింది.