కాంగ్రెస్ కుల రాజ‌కీయాలు చేస్తోంది – బిజేపి అధ్య‌క్షుడు అమిత్ షా

Amit-Shah

2014 తర్వాత నిర్వహించిన ప్రతి ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ బలోపేతమవుతూ వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ జాతీయ సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో ప్రజలు మాకు అధికారాన్ని బహుమానంగా ఇచ్చారన్నారు.నాలుగున్నరేళ్ల పాలనలో ప్రతి ఒక్కరి వికాసం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలంతా ఇంటింటికీ వెళ్లి చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.