ఎన్నికలు సమీపిస్తున్నసమయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది తెలుసుకదా. అధికారం ఇంకొద్ది నెలలో ముగుస్తున్న తరుణంలో రాష్ట్రం మొత్తంతిరుగుతూ , ప్రకటనలు ప్రకటిస్తూ వివిధ ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు చేసేస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు పింఛన్లు చంద్రబాబు పెంచారు . చంద్రబాబు ఈసారి ఇంకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ఇది రైతుల కోసం అని అన్నారు.
అదే పెట్టుబడి సాయం కదా .ప్రస్తుతం పదకం లో సొంత భూములున్న రైతుల మాత్రమే .ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే కౌలు రైతులకు కూడ వర్తిస్తుందట. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చుపై, ఎవరికీ ఎంత మొత్తం ఇవ్వాలి, విధి విధానాలేమిటి అనే అంశాలపై ఇప్పటికే వ్యవసాయ, ఆర్ధిక శాఖలతో చర్చలు జరుపుతోంది అని చెప్పారు . అన్నీ కుదిరితే ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఈ విధం గా చంద్రబాబు అనేక పధకాలు ప్రవేశపెడుతున్నా.దీని పై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.