చారిత్ర‌క కార‌ణాల‌తోనే ఏపి వెనుక‌బాటుత‌నం – సిఎం చంద్ర‌బాబు

AP CM Chandra Babu Naidu

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొమ్మిదో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులపై శ్వేతపత్రాన్ని వెలువరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తలసరి ఆదాయాన్ని పెంచేందుకు,సంపదను సృష్టించేందుకు పరిశ్రమలు, సేవల రంగాలే ముఖ్యమన్నారు.చారిత్రక కారణాల వల్ల పారిశ్రామిక, సేవారంగాల్లో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు.

12 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని…అయితే,10.5 శాతం వృద్ధిని మాత్రమే సాధించామని వివ‌రించారు.వ్యవసాయరంగం నుంచే 55 శాతం ఉపాధి లభిస్తోందని తెలిపారు సిఎం చంద్ర‌బాబు.ఈ శక్తిని పారిశ్రామిక, సేవారంగానికి మార్చగలిగితే తలసరి ఆదాయం పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.