మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు ..!

vem-narendar reddy
vem-narendar reddy

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు వచ్చింది.ఈ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.వారం రోజుల్లో హైదరాబాద్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ నోటీసులో వెల్ల‌డించింది. ఏసీబీ అభియోగపత్రాల ఆధారంగా ఓటుకు నోటు కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశం అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పోటీ చేశారు.

ఇత‌డిని గెలిపించేందుకు రేవంత్, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, సెబాస్టియన్, ఉదయసింహా కలిసి కుట్ర పన్నారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చేందుకు నిందితులు ప్రయత్నించారని అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సహా నిందితులందరికీ నోటీసులు ఈడీ జారీ చేసే అవకాశం ఉంది.