ముగింపు ద‌శ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర

Jaganmohan_Reddy

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9న ముగియనుంది. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తికానుంది.

ఇప్పటివరకు 134 నియోజవకర్గల్లో 120 బహిరంగ సభలు, రెండు వేలకుపైగా గ్రామాలు, 3500 కి,మీ పైగా పాదయాత్ర సాగింది. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తార‌ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.