టీడీపీకి షాక్.. వైసీపీలోకి మరో నేత

TDP,AP ELECTION,YCP,RAMPULLAREDDY,

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. రాజకీయంగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దూకిన సంగతి తెలుసు కదా..

ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ కి ఊహించని షాక్ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత రాంపుల్లారెడ్డి ఇరిగెల .. వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం అని తెలుస్తోంది. శనివారం ఆయన ఆళ్లగడ్డలో తన అనుచరులతో సమావేశమయ్యారు అని సమాచారం.

ఈ సమావేశంలో ఆయన టీడీపీ ని వీడారని, వైసీపీలో చేరాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ.. తనకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన తన సన్నిహితులతో చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో రాంపుల్లారెడ్డి ఇరిగెల వైసీపీ కి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.