కోడెలపై దాడి కేసులో పోలీసలు అదుపులో నిందితులు

Police Arrest Speaker Kodela Siva Prasad Attack Case Accusers In Enumetla
Police Arrest Speaker Kodela Siva Prasad Attack Case Accusers In Enumetla

పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలపై జరిగిన దాడి కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రాజుపాలెం మండలం ఇనిమేట్లలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ నేత, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఇనిమెట్ల గ్రామంలో కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు వీడియోల ఆధారంగా దాదాపు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. దాడిని ప్రోత్సహించినందుకు అంబటి రాంబాబు, రాజ నారాయణపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.