ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుతా – స్పీక‌ర్ పోచారం

Pocharam Srinivas Reddy, Telangana, Ap, Speaker, kcr, Wishes, AgricultureDept,

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌, సభ్యులకు పోచారం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో తొలిసారిగా ఆయన ప్రసంగించారు . స్పీక‌ర్ పదవి అత్యంత కీలకమని.. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభను నిర్వహించుకుందామని చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో సభ్యులంతా సహకరిస్తారని భావిస్తున్నానన్నారు. సభ్యులందరం కలిసి ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదామని పోచారం పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.