తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గా పోచారం ఎన్నిక లాంఛ‌న‌మే..!

Pocharam Srinivas Reddy
Pocharam Srinivas Reddy

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. పోచారం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో రెండో సభాపతిగా పోచారం ఎన్నిక ఖాయమైంది. ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు., ఆయన ఎన్నిక ఏకగ్రీవమే. స్పీకర్ పదవికి పోటీ పెట్టరాదని కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో… పోచారం ఎన్నిక లాంఛనం కానుంది. ఈ పదవికి పార్టీ సీనియ‌ర్ నేతల‌ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ, మిగతా వారెవరూ స్పీకర్ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.