మోదీకి సియోల్ శాంతి పురస్కారం

Narendra Modi
Narendra Modi

ప్ర‌పంచ శాంతి, భ‌ద్ర‌త‌కు ఉగ్ర‌వాదం పెను ముప్పుగా మారింద‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ. ఇప్పుడు తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ప్రపంచ‌దేశాల‌కు స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను సంపూర్ణంగా నిర్మూలించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు ఆయ‌న‌. ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ అవార్డు గ‌త అయిదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌మ‌న్నారు మోదీ. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు ద‌క్కుతుంద‌న్నారు ప్ర‌ధాని. సియోల్ శాంతి బ‌హుమ‌తిని మోదీ దేశానికి అంకితం చేశారు. మ‌రోవైపు ప్రైజ్‌మ‌నీ కింద వ‌చ్చే సుమారు కోటిన్న‌ర రూపాయాల‌ను ఆయ‌న న‌మామి గంగే నిధికి స‌మ‌ర్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.