ఈ నెల 9న ప్రధాని మోదీ తిరుమల పర్యటన…!

PM Narendra Modi

ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్వాగతం పలకనున్నారు. మోదీతో పాటు జగన్ కూడా తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలకు మోదీ రాక నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మోదీతో జగన్‌ భేటీ అయి పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇక జూన్‌ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారని సమాచారం. నీతి ఆయోగ్‌ సమావేశానికి అన్ని రాష్ర్టాల సీఎంలు, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.