పార్టీకి మోదీ – అమిత్ షా ఎంత విరాళ‌మిచ్చారో తెలుసా ..!

Amit Shah and Prime Minister Narendra Modi donated
Amit Shah and Prime Minister Narendra Modi donated

భారతీయ జనతా పార్టీ కి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంత విరాళం ఇచ్చారో తెలిస్తే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు . అస‌లు ఇంత విరాళం ఇస్తార‌ని మీరు ఊహించి కూడా వుండ‌రు. ఇంత‌కీ ఎంతిచ్చారో తెలుసా. వీరిద్ద‌రూ అక్ష‌రాల వెయ్యి రూపాయ‌ల విరాళం ఇచ్చారు.

అయితే ఇంత తక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వాళ్లు ఓ సందేశాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడే పరిస్థితి పోవాలన్నారు. విరాళాల్లోఓ పారదర్శకత రావాలని పిలుపునిచ్చారు అమిత్ షా . దీన్ దయాల్ ఉపాధ్యాయ 51వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. విరాళాల విషయంలో మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరాన్ని వెల్ల‌డించారు ఆయన.

దీనికి ముందు మోదీతో కలిసి ఆయన పార్టీ యాప్ ద్వారా రూ.వెయ్యి విరాళాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తలంతా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాన‌న్నారు ఆయ‌న‌. మన డబ్బుతో ఈ పార్టీ నడిపిద్దాం కానీ బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్ల సొమ్ముతో కాద‌న్నారు అమిత్ షా.