పేట…విశ్వాసం…గెలుపెవరిది?

Petta Vs Viswasam
Petta Vs Viswasam

తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పొంగల్ కి భారీ సినిమాల నడుమ భీకరమయిన పోరు నడుస్తుంది.రజిని నటించిన పెట్టా ఒక వైపు,అజిత్ నటించిన విశ్వాసం మరోవైపు.రెండో ఒకేరోజు రిలీజ్.వద్దు అని ఇండస్ట్రీ పెద్దలు ఎంతమొత్తుకున్నా వినకుండా రెండు సినిమాలు రిలీజ్ చేశారు.దీంతో అభిమానుల మధ్య గొడవలు,పొడుచుకునేవరకు వెళ్ళింది పరిస్థితి.అంతగా అందరిలో ఆసక్తి రేపిన రెండు సినిమాలలో దేనికి ఫస్ట్ ప్లేస్ దక్కింది అనే విషయంలో ఆసక్తికరమయిన వార్తలు వినిపిస్తున్నాయి.

అజిత్ ఫ్యాన్ బేస్ తో పోల్చుకుంటే రజిని ఫ్యాన్ బేస్ ఎక్కువ.రజిని సినిమా పెట్టా పై అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.అయితే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగుల కూడా రిలీజ్ అయ్యింది.వివాసం మాత్రం రెండు వారలు లేటుగా తెలుగులో వస్తుంది.పెట్టా సినిమా ఫస్ట్ హాఫ్ వరకు రజిని మాయాజాలంతో,ఆయన ఇమేజ్ తో నడిచిపోయింది.రజినీకాంత్ హావభావాలు,మ్యానరిజమ్స్ అన్నీ అదిరిపోయాయి.

కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం పెట్టా తెలిపియింది.దీంతో ఈ సినిమాకి తమిళనాడు లో సైతం యావరేజ్ టాక్ వచ్చింది.ఇక ఇప్పటికే డైరెక్టర్ శివ తో కలిసి హ్యాట్రిక్ విజయాలు అందించిన అజిత్ ఈ పొంగల్ కి మళ్ళీ మరొక మంచి మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.విశ్వాసం అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ముందునుండి భారీ అంచనాలు రేపింది.అయితే విశ్వాసం కూడా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా ఉందట.కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త తగ్గింది అంటున్నారు.

ఇక ఈ తెలుగులో సినిమాల్లో సూపర్ విలన్ గా చెలరేగుతున్న జగపతి బాబు పెర్ఫార్మెన్స్ బావున్నా కూడా అతని క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాకు మైనస్ అనే టాక్ వినిపిస్తుంది.నయనతార ఫ్యాక్టర్ ఈ సినిమాకి వెయిట్ తీసుకువచ్చింది.రెండు సినిమాల ఫలితాలను విశ్లేషిస్తే రజినీకాంత్ పెట్టా పై విశ్వాసం పైచేయి సాధించింది అని అర్ధమవుతుంది.పెట్టా ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్టఫ్ లో సగమయిన సెకండ్ హాఫ్ లో ఉండి ఉంటే ఫలితం,పరిస్థితి మరో రకంగా ఉండేవి.

అయితే రెండు సినిమాల్లో ఏదీ కూడా క్లియర్ విన్నర్ గా నిలవలేకపోవడం విశేషం.విశ్వాసం సినిమాకి ఉన్న టాక్ ని బట్టి ఆ సినిమా ఇక్కడ మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి.

మొత్తానికి పొంగల్ వార్ కి జరిగిన హడావిడి రేంజ్ లో రిజల్ట్స్ లేవు.కానీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటూనే ఉన్నారు.