పేట రివ్యూ

PETTA Review
PETTA Review

నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు.
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత : కళానిధి మారన్
సంగీతం : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫర్ : యస్ తిరు
ఎడిటర్ : వివేక్ హర్షన్
విడుదల తేదీ : జనవరి 10, 2019
రేటింగ్ : 2.75/5

ఒకప్పుడు తన స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో యూత్ ని మాస్ ని మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ ని కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకున్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి నుంచి వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు. అయితే.. ఈ సారి మాత్రం టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ కార్తీక్ సుబ్బరాజ్ తో పెయిర్ అప్ అయిన రజని పేటా అనే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేశాడు. టీజర్ అండ్ ట్రైలర్స్ తోనే ఇది రజనీని నమ్ముకుని చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ అని కన్వే అయ్యింది. బాషా తరహా స్టైల్ , రజనీ వింటేజ్ లుక్స్ హైలెట్ గా తెరకెక్కిన పేట ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లోకి వచ్చింది.రిలీజ్ కి ముందే భారీ అంచనాలు రేకెత్తించిన పేట ఎలా ఉంది?,ఎలాంటి ఫలితం అందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

ఎక్కడి నుంచో వచ్చి ఓ కాలేజ్ హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అవుతాడు కాళి. అక్కడ స్టూటెండ్స్ మధ్య ఉన్న గొడవల్ని ఆపి వాళ్ల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు.అక్కడ హాస్టల్ లో ఉండే అన్వర్ అనే విద్యార్దికి వచ్చిన లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు.అలానే సాల్వ్ చేస్తాడు కూడా.అయితే ఈ లోగా ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది రౌడీ లు వచ్చి కాళీని మరియు అన్వర్ ని చంపాలని చూస్తారు. ఇంతకూ అసలు కాళీ ఎవరు..? అతని గతం ఏంటి..? అన్వర్ కి కాళీకి ఉన్న సంబందం ఏంటి..? వీళ్లిద్దరినీ చంపాలనుకుంటున్నవాళ్లు ఎవరు..? ప్రత్యర్దులను కాళీ ఎలా అంతమొందించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ రజినీకాంత్.గెట్ రజినిఫైడ్ అనే ట్యాగ్ లైన్ తోనే ఇది రజిని ని నమ్ముకుని చేసిన సినిమా అని చెప్పకుండానే చెప్పేసారు.అయితే ఈ మధ్య రజిని ఎనర్జీ లెవల్స్ లేకుండా,తనకి గుర్తింపు తెచ్చిన స్టైల్ జోకిలి పోకుండా చేస్తున్న సినిమాలు ఫెయిల్ అవ్వడం అనే మాట పక్కనబెడితే రజిని ఇమేజ్ నే మార్చేసినతపనిచేశాయి.అంతా బాషా లాంటి సినిమా కావాలి అని కోరుకుంటున్నారు.ఆ సినిమా డైరెక్టర్ కూడా అలానే కోరుకుని అలాంటి అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసాడు.ఫస్ట్ హాఫ్ లో కథ అనేది లేకపోయినా కూడా రజిని మ్యాజిక్ వర్క్ అవుట్ అవడంతో సినిమా నాన్ స్టాప్ గా అలరిస్తూ స్మూత్ గా ఇంటర్వెల్ వరకు వెళ్లిపోయింది.ఇంట్రావెల్ తరువాత ఇంకా రేంజ్ పెరుగుతుంది అని ఊహిస్తాం.కానీ సెకండ్ హాఫ్ నుండి గ్రాఫ్ ఫుల్ గా డౌన్ అయ్యిపోయింది.కాళీ పాత్రలో అదరగొట్టిన రజిని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పేట వీర పాత్రలూ మాత్రం పేలవంగా కనిపించాడు.చాలా పథ కథపై ఈ సినిమాని బేస్ చేసాడు కార్తీక్ సుబ్బరాజ్.దాంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి సన్నగిల్లడమే కాదు ఫస్ట్ హాఫ్ కిక్ కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయింది.అక్కడి నుండి అలా అలా సాగుతూ ఆ ఫ్లాష్ బ్యాక్ తరువాత సగటు రివెంజ్ డ్రామాగా మారిపోయింది.ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ఎమోషన్ అస్సలు కనెక్ట్ కాకపోవడంతో రివెంజ్ డ్రామా కూడా చాలా రొటీన్ వ్యవహారముగా మారిపోయింది.సినిమాకి కీలకమయిన ఆ సీన్స్ లో రజిని నటన గాని,డైరెక్టర్ ఇంపాక్ట్ గాని అప్ టు డా మార్క్ లేకపోవడఎం విచిత్రం.

నటీనటులు:

తన స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ తో సూపర స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఈ సినిమాలో లుక్స్ పరంగా ఫస్ట్ షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే లుక్ లో అనుక్షణం రకరకాల మేనరిజమ్స్ చూపిస్తూ..రజనీ ఈజ్ బ్యాక్ అనిపించాడు. అయితే ఈ మెరుపులన్నీ ఫస్టాఫ్ లోనే కాళి క్యారెక్టర్ వరకూ మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే సినిమాకు కీలకం అయిన పేటవీర పాత్రలో ..రజనీ చాలా సాదాసీదాగా కనిపించాడు. కథ కథనాలు డల్ గా ఉండడంతో రజనీ మ్యాజిక్ డైల్యూట్ అయ్యింది,ఆ తరువాత పూర్తిగా కనుమరుగయింది.టాలెంటెడ్ యాక్టర్స్ అయిన విజయ్ సేతుపతి., నవాజుద్దీన్ సిద్దిఖీ, బాబీ సింహ, శశికుమార్ సూపర్ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు. చాలా కాలం తర్వాత పేటలాంటి పెద్ద సినిమా చేసిన సిమ్రన్ కు కాస్త ఇంపార్టెంట్ రోల్ దక్కింది. ఇక త్రిష పాత్రకు గానీ, త్రిష కుగానీ సినిమాలో అసలు స్కోప్ దక్కలేదు. మేఘ ఆకాష్ పాత్ర కూడా స్పెషల్ అప్పియరెన్స్ లా ఉంది. మిగతా నటీనటులందరూ పరవాలేదనిపించారు.

టెక్నీషియన్స్:

పిజ్జా సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ …వరుసగా ఆకట్టుకునే సినిమాలే చేశాడు. అలాంటి డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ ,తలైవా లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు అనగానే..అందరిలో ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ కూడా అంతే ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. సినిమా స్టార్టింగ్ నుంచి రజనీకాంత్ అభిమానిగా.. అతను ఎలా చూడాలనుకున్నాడో అలాగే..స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా చూపించాడు సుబ్బరాజ్. రజనీకాంత్ లోని పాత ఎనర్జీని, చలాకీ నటనను వాడుకుంటూ.. ఫస్టాఫ్ వరకూ బాగానే బండి లాగించాడు. సినిమాకి కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం 25 ఏళ్ల క్రిందటి ఫార్ములాను వాడి తీవ్రంగా నిరాశ పరిచాడు. అప్పటి వరకూ ఉత్సాహంగా సాగిన సినిమా .. కార్తీక్ ఎంచుకున్న ఓల్డ్ ఫార్ములా వల్ల విసిగిస్తూ సాగింది. గెట్ రజనీ ఫైట్ అనే ట్యాగ్ కి కొంతవరకూ న్యాయం చెయ్యగలిగాడు సుబ్బరాజు. ఇక అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఆర్.ఆర్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నలిచింది. సినిమాటోగ్రాఫర్ తిరు విజువల్స్ బాగున్నాయి. గ్రాండియర్ అండ్ ఎలివేషన్ ప్రజెంటేషన్స్ లో తిరు సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. లొకేషన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి.

చివరిగా:

మామూలు సినిమాను కూడా తన ప్రజెన్స్ తో ప్రస్టేజియస్ హిట్స్ గా నిలిపే సత్తా ఉన్న రజనీకాంత్ కబాలి, కాలా లాంటి సినిమాల్లా కాకుండా ఫ్యాన్స్ కోరకునే విధంగా మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ చేశాడు. కాకపోతే..కథకథనాలలో మాత్రం పాత వాసనలు, తమిళనేటివిటీ ఎక్కువగా టచ్ అవ్వడంతో ఫస్టాఫ్ వరకూ పరిగెత్తిని సినిమా రెండో బాగంలో చతికిలపడింది. అసలే థియేటర్స్ కొరతగా ఇబ్బంది పడుతున్న పేట..కమర్షియల్ గా ఏ విజయం సాధిస్తుందో చూడాల్సిందే.