పెట్టా ట్రైలర్:పక్కా రజిని మార్క్ మ్యాజిక్

Rajinikanth Peta

పేట…ఇది పొంగల్ కి ట్రీట్ ఇవ్వడానికి వస్తున్న రజిని కాంత్ కొత్త సినిమా పేరు.తమిళ్ లో కూడా పెట్టా అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా పై ముందు నుండే అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ చేసింది.ఎప్పటినుండో రజినికాంత్ సినిమాల్లో మిస్ అవుతూ వస్తున్న సూపర్ స్టార్ మార్క్ అండ్ మ్యాజిక్ ఈ సినిమాలో మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్ గా అలరించబోతుంది అని అర్ధమవుతుంది.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఒక సగటు అభిమానిలా అలోచించి ఈ సినిమా తీసాడు.బాషా తరహాలో టు లేయర్డ్ నెర్రెషన్ లో ఈ సినిమా సాగబోతోంది.ఒక హాస్టల్ వార్డెన్ గా ఉంటూ సిమ్రాన్ తో లవ్ ట్రాక్ రన్ చేస్తున్న కాళీ అసలు ఎవరు?,ఎక్కడి నుండి వచ్చాడు?,అతని గతం ఏంటి అనే అంశాలను టచ్ చేస్తూ ఈ సినిమాని డిజైన్ చేసారు.

ఈ సినిమాలో సిమ్రాన్ తో పాటు త్రిష కూడా హీరోయిన్ గా కనిపిస్తుంది.కానీ కథకి కీలకమయిన క్యారెక్టర్ కావడంతో ఆమె పాత్రకి ట్రైలర్ లో స్కోప్ ఇవ్వలేదు.ఇక ఈ సినిమాలో రజిని ని సపోర్ట్ చేస్తూ విజయ్ సేతుపతి,బాబీ సింహ,శశి కుమార్,నవాజుద్దీన్ సిద్దికీ లాంటి కీలకతారాగణం ఎటూ ఉన్నారు.అలాగే తెలుగులో లై అండ్ చల్ మోహన రంగ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మేఘ ఆకాష్ కూడా ఈ సినిమాలో కాస్త వెయిట్ ఉన్న క్యారెక్టర్ దక్కించుకుంది.కథ పరంగానే కాదు,రజిని స్టైల్ అండ్ కమర్షియల్ యాంగిల్ ని పదేళ్ల క్రితం ఉన్న రేంజ్ లో చూపించబోతున్నాడు కార్తీక్ సుబ్బరాజ్.రజిని కాంత్ కూడా కొత్త ఉత్సాహంతో ఈ సినిమా చేసాడు అని అర్ధమవుతుంది.

పేట రజని మార్క్ సినిమాలని ఇష్టపడేవాళ్ళకి ఒక పండగ లాంటి సినిమా.మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ పూనకాలు తెప్పిస్తుంది.తిరు సినిమాటోగ్రఫీ,పీటర్ హెయిన్ ఫైట్స్,సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా సినిమాకి ఎస్సెట్స్ గా నిలిచాయి.తెలుగు లో ప్రస్తుతానికి ఈ సినిమా స్నిక్ పీక్ మాత్రమే రిలీజ్ చేసారు. గెట్ రజినిఫైడ్ అని పెట్టిన క్యాప్షన్ హైలైట్ అనకుండా ఉండడం కష్టం.