రేపు రజనీకాంత్ ‘పేట’ ప్రీ రిలీజ్ ఈవెంట్…!

peta movie

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పేట’. త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.ఈ చిత్రనికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ విలక్షన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్ లోని సైబర్ కన్వేన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు చిత్ర యూనిట్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నెల 10వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.