తెలుగులో పేట కి తప్పని తిప్పలు

peta movie

రజిని కాంత్ చాలా కాలం తరువాత తన మార్క్ స్టైల్,అలరించే మ్యానరిజమ్స్ అండ్ హై ఎండ్ యాక్షన్ తో చేస్తున్న సినిమా పేట.ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ అవుతుంది.కానీ తెలుగు ట్రైలర్ చాలా లేట్ గా ప్రేక్షకులముందుకు వచ్చింది.అయితే ఆ ట్రైలర్ లేట్ గా రిలీజ్ అవ్వడానికి సరయిన కారణం ఉంది అనే టాక్ వినిపిస్తుంది.రజిని కాంత్ ఇంతకు ముందు చేసిన సినిమాల తాలూకు చేదు అనుభవాలు ఈ సినిమాపై ప్రభావం చూపించాయి. వరుసగా కబాలి,లింగా అండ్ కాలా..ఇలా అన్నీ కూడా పెట్టినపెట్టుబడిలో సగం కూడా పట్టుకురాలేదు.రజిని కాంత్ సినిమాకి ప్రొడ్యూసర్ అన్న లేబుల్ తప్ప ఆ సినిమాలు కొనుకున్నవాళ్లకు మిగిలింది ఏమీ లేదు.

అందుకే ఇప్పడు పేట రైట్స్ విషయంలో చాలా డిస్కషన్స్ నడిచాయి.గతంలో శివాజీ సినిమా హక్కుల విషయంలో చాలా పొతే నడిచింది.అప్పుడే రజిని మార్కెట్ 20 కోట్ల రేంజ్ లో ఉండేది.అంటే తెలుగులో ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమా తియ్యడానికి సరిపడా బడ్జెట్.ఆ తరువాత రోబో కి కూడా అదే పరిస్థితి.ఆ తరువాత మాత్రం రజిని మార్కెట్ ధారుణంగా దెబ్బతింది.కబాలి సినిమా దెబ్బకి బయ్యర్స్ కి కళ్ళు బయ్యర్లు కమ్మాయి.ఆ తరువాత కూడా అదే పరిస్థితి.దాంతో 30 నుండి 40 కోట్ల మేర ఫ్లక్చువేట్ అయిన రజిని తెలుగు మార్కెట్ అనూహ్యంగా కుప్పకూలింది.

అనేక డిస్కషన్స్ తరువాత రియాలిటీ లోకి వచ్చిన సన్ పిక్చర్స్ తక్కవ రేటుకే పేట సినిమా అమ్మడానికి రెడీ అయ్యింది.ఫైనల్ గా పేట తెలుగు డబ్బింగ్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడయ్యాయి.నిజానికి రజిని కాంత్ కి సరయిన పడితే పెట్టినదానికి రెట్టింపు రాబట్టడం ఖాయం.కానీ ఇప్పడు పరిస్థితి వేరు.తెలుగులో మూడు పెద్ద సినిమాల మధ్య వస్తుంది.దాంతో అందరూ ఆ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.పేట కి సరయిన థియేటర్స్ కూడా దొరకట్లేదు.అందుకే ఆ నిర్మాత కూడా లిమిటెడ్ రిలీజ్ కి వెళుతున్నాడు.సంక్రాంతి రావాలి అనే పట్టుదలకు పోకుండా ఉండి ఉంటే పేట కి అన్నిరకాలుగా మేలు జరిగేది.కానీ ఇప్పడు అలా జరగలేదు కాబట్టి రజిని మ్యాజిక్ కి తోడు కంటెంట్ కూడా బలంగా ఉంటేనే ఆ సినిమా సేఫ్ అవుతుంది.లేదంటే మాత్రం తలైవా కి తెలుగులో మరో పరాజయం ఎదురైనట్టే.