‘మహర్షి’ స్పెషల్ షోస్ కి తెలంగాణలో లైన్ క్లియర్…!

Maharshi
Maharshi

పైడిపల్లి వంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’.పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాపోతున్నాడు.ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి గతంలో మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ సెంటిమెంట్ ‘మహర్షి’ విషయంలోనూ రిపీట్ అవుతోందని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలివారంలోనే భారీ కలెక్షన్లు రాబట్టుకోవాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. మహర్షి సినిమాకను రోజుకు ఐదు షోలు వేయడానికి తెలంగాణ సర్కారు అంగీకరించింది. అలాగే టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్ యాజమన్యాలకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. దీంతో సాధారణ రేట్ల కంటే ఎక్కువ ధరకు టికెట్లను విక్రయిస్తున్నారు.