మ‌న్మ‌థుడు 2 లో పాయ‌ల్ రాజ్ పూత్ ?

Payal Rajput
Payal Rajput

నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మ‌న్మ‌థుడు ఒక‌టి. కె విజ‌య్ భాస్క‌ర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంకి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఒక క‌థ‌నాయిక‌గా ఎంపిక చేశార‌ని అన్నారు. కాని ఓ మీడియా సంస్థ‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాయ‌ల్ తాను మ‌న్మ‌థుడు 2 చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ని ఖండించారు. దీంతో నాగ్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. పాయ‌ల్ ఇప్ప‌టికే ర‌వితేజ డిస్కోరాజా చిత్రంలో ఆఫ‌ర్ కొట్టేయ‌గా, వెంకీ మామ 2లో చైతూతో జ‌త‌క‌ట్ట‌నుంద‌ని సమాచారం.