ప‌రుగులు పెట్ట‌నున్న జ‌న‌సేన ప్ర‌చార ర‌ధాలు

Janasena Party
Janasena Party

జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌చార ర‌ధాలు రెఢీ అయ్యాయి.వీటిని గుంటూరు జిల్లా మంగళగిరిలో కొత్తగా నిర్మించిన జనసేన కార్యాలయంలో ప్రచార రథాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు.జనసేన సిద్ధాంతాలు,అధికారం అప్పగిస్తే చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించిన ఈ రథాలను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా రూపొందించారు.ఈ సందర్భంగా ఆకట్టుకునేలా రథాలను సిద్ధం చేసిన జనసైనికులను పవన్ అభినందించారు.ఇవాళ్టి నుంచే ఈ ప్రచార రథాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి.