మ‌హిళా క‌మిటీల‌తో జ‌న‌సేన ముంద‌డుగు

pawan kalyan
pawan kalyan

పార్టీని పటిష్టం చేసేందుకు జనసేన ముంద‌డుగులు వేస్తోంది. ఇప్ప‌టికే యువజన, విద్యార్థి సంఘాల నిర్మాణాలను చేపట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జనసేన వీర మహిళా సంఘంగా నామకరణం చేశారు. జనసేన పార్టీ కమిటీలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూపకల్పన చేశారు. జవ్వాని రేఖను చైర్ పర్సన్‌గా నియమించారు.

కర్నూలు జిల్లాకు చెందిన రేఖ ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. బీసీ సమాజానికి చెందిన రేఖను చైర్ పర్సన్ గా నియమించటం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పించినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. ప్రస్తుతం పదవులు పొందిన వారంతా విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐ.టి.నిపుణులతోపాటు గృహిణిలు కూడా వీరిలో వున్నట్టు వెల్ల‌డించారు.