పోరాట యాత్ర‌ల‌కు ప‌వ‌న్ ఫుల్ స్టాప్ ..!

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan

ప్రజా పోరాటయాత్రలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో త‌న వ్యూహానికి ప‌దును పెట్టారు. ఇప్పటివరకు ప్రజా పోరాటయాత్రల పేరుతో జిల్లాలను చుట్టేశారు. ఎన్నికలకు తక్కువ సమయమే ఉండడంతో పవన్ పండగ తరువాత త‌న ప్లాన్‌ ని అమ‌లు చేయ‌బోతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ప‌క్కా ప్లాన్ ముంద‌డుగు వేయ‌నున్నారు ప‌వ‌న్‌.

ఇకపై సమస్యలను బేస్ చేసుకొని జిల్లాలలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో పార్టీ కార్యాలయంలో ఉంటూ జిల్లాలో పర్యటించాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా స‌మాచారం. ఈ విధంగాజనసేన కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటూనే ఇటు అభిమానుల్లో అటు పార్టీ కేడ‌ర్‌లో ఎన్నిక‌ల స‌మ‌రోత్సాహాన్ని నింప‌నున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.