పెనుగొండ‌కు ప‌వ‌న్ ఎందుకు వెళ్లారో తెలుసా ..!

Pawan Kalyan
Pawan Kalyan

పెనుగొండ శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి త‌ల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అంద‌రి ఆడ‌ప‌డుచుల‌పై ఉండాల‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆకాంక్షించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ‌లో శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారి కుంబాభిషేకం, విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వాల్లో ఆయ‌న పాల్గొన్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఎతైన , పంచ‌లోహ‌ల‌తో త‌యారైన 90 అడుగుల శ్రీ వాస‌వీక‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ధ‌ర్మం దారి త‌ప్పిన‌ప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవార‌ని వెల్ల‌డించారు ప‌వ‌న్. ఆమె జన్మించిన ఊరుగానే కాదు… ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉంద‌న్నారు ఆయ‌న .

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరు పేరును శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ గా మారుస్తామ‌ని హామీ ఇచ్చారు. పెనుగొండ‌లో రూ. 17 కోట్ల‌తో శ్రీ వాస‌వీమాత 90 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హ ప్రతిష్టాప‌న‌, కుంబాభిషేక మ‌హోత్స‌వాలు ఐదు రోజుల పాటు జ‌రుగుతున్నాయి.