రేపు అమరావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్…!

Pawan Kalyan..
Pawan Kalyan..

జనసేన అధినేత కల్యాణ్ గురువారం అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకొంటారు , అక్కడ్నుంచి పటమట లంకలోని తన నివాసానికి వెళ్లనున్నారు పవన్.మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాలల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఇప్పటికే పవన్ కార్యాయం నుంచి సంక్షిప్త సమాచారాలందించారు. ఈ సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు, అనంతరం ప్రెస్‌మీట్ లో పార్టీ వ్యవహారాలపై మీడియాలతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు పవన్.