‘ఎఫ్2’ లో పవన్ ని వాడేసుకుంటున్నవరుణ్ తేజ్…!

Varun Tej
Varun Tej

కొంతమంది డైరెక్టర్స్ కరెక్ట్ కంటెంట్ తోనే సినిమాలు తీస్తారు.మరి కొంతమంది మాత్రం ఎదో రకంగా సినిమాని హిట్ చెయ్యాలని ట్రై చేసి అనుకున్నది సాధిస్తారు.అనిల్ రావిపూడి సెకండ్ క్యాటగిరి లోకి వస్తాడు.అందుకే అతను చేసిన సుప్రీం కూడా హిట్ సినిమాస్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.సినిమా కథ,కథనాలు ఎలా ఉన్నా తనకి బాగా అబ్బిన,అచొచ్చిన కామెడీ టైమింగ్ తో సినిమాని గట్టెక్కించగలగడం అనిల్ స్పెషాలిటీ.ఇప్పడు F2 విషయంలో కూడా సేఫ్ సైడ్ గా ఇలాంటి సైడ్ ట్రాక్ కొన్ని వాడాడట ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.వెంకీ లో మునుపటి కామెడీ టైమింగ్ ని మళ్ళీ కొత్తగా ఫోకస్ చేస్తున్న అనిల్ మరో హీరో వరుణ్ తేజ్ తో కూడా కామెడీ చేయించాడు.రిలీజ్ అయ్యేది సంక్రాంతి సీజన్ కాబట్టి పాస్ అయిపోవడం చాలా ఈజీ.అయితే ఎందుకయినా మంచిది అని వెంకీ హిట్ సినిమా కూలీ నెంబర్ 1 గెట్ అప్ తో కాసేపు,పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కొంత సేపు అలరించేలా ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ చేసాడు.

ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో పవన్ ని పెద్దగా వాడనిది…ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అసలు మెగాఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని పెద్దగా వాడుకోండి వరుణ్ తేజ్ ఒక్కడే.ఫిదా,తొలిప్రేమ,కంచె అన్నీ కూడా కంటెంట్ తో హిట్ అందుకున్న సినిమాలే.అయితే బాబాయ్ అయిన పవన్ పేరు వాడుకుంటే తప్పేముంది అనుకున్నాడేమో F2 కోసం పవన్ గుర్తు చేస్తున్నాడు.ఈసారి మంచి రెస్పాన్స్ వస్తే మెగా ప్రిన్స్ కూడా పవన్ ని అప్పుడప్పుడు,కుదిరినప్పడు వాడేసుకుంటావుడ్ అందంలో నో డౌట్.